Total Pageviews

Saturday, January 12, 2013

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడు (ముద్దుపేరు గున్ను ) మొదటిసారి అమ్మానాన్నల మాతృభూమి భారతదేశానికి నాలుగు నెలల సెలవులకి వెళ్ళాడు. డిసెంబర్ 10, 2012 న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అమ్మ తో కలిసి ఇండియా కి బయల్దేరాడు గున్ను.  ప్రయాణానికి 10 రోజుల ముందునుండే బుజ్జి గాడి నాన్న వాడిని వదిలి అన్నిరోజులు ఎలా ఉండాలా అని బాధ పడ్తుంటే బుజ్జి గాడికి అవేమి అర్థం కాలేదు పాపం. తీరా జర్నీ రోజు, చెక్-ఇన్ అంతా అయిపోయి సెక్యూరిటీ చెక్ లో వెళ్ళేదాకా బుజ్జి గాడు నాన్న చంకలోనే ఉన్నాడు. అమ్మ సెక్యూరిటీ చెక్కి  వెళ్ళాలి ఫ్లైట్ బయల్దేరే టైం అవుతుంది నాన్నకి బాయ్ చెప్పి నా దగ్గరికి రామ్మా గున్నూ అంటే బుజ్జిగాడు నాన్న చొక్కా పట్టుకొని గట్టిగ నాన్నకె అతు క్కుపోయాడు. అప్పుడు నాన్న గున్నుని బలవంతంగా అమ్మ కి ఇచ్చేసారు. అప్పుడు గున్నుగాడికి భలే కోపం వచ్చింది. కోపంగా నాన్న వంక ఒక చూపు చూసి అమ్మతో కలిసి సెక్యూరిటీ చెక్ ఏరియా లోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు సెక్యూరిటీ చెక్ లో  TSA ఏజెంట్ అమ్మ దగ్గరున్న అన్ని బాగులు ఓపెన్ చేయమన్నాడు. అమ్మ ఆ హడావుడిలో ఉంటె అంతమంది జనాలని చూసి బుజ్జిగాడికి భయం వేసింది ఏమవుతున్దా అని. ఈలోగా అమ్మ ఒక బాగ్ లోనుంచి లాప్టాప్ తీస్తుంటే బుజ్జిగాడు  అది నాకు కావాలి అని అమ్మకి అడ్డం వచ్చాడు అమ్మ చుసుకోకపోవడంతో లాప్టాప్ బుజ్జి గాడికి తగిలి ఏడుపు లంగించుకున్నాడు బుజ్జి గాడు. మొత్తానికి  ఫ్లైట్ ఎక్కారు బుజ్జి గాడు అమ్మ. గున్ను గాడికి ఫ్లైట్ ఎంతగానో నచ్చింది. అంతమంది జనాలు ఒకచోట కూడితే ఇంక వాడికి పండగేకడా. అమ్మ TSA వాడితో పోట్లాడి మరీ తెచ్చిన 10 రకాల తినుబండారాలు (స్నాక్స్) ని అన్నిటిని నచ్చలేదని వదిలేసాడు గున్ను. బుజ్జిగాడికి ఇష్టమని ఎక్ష్ ట్రా ఫర్మ్ తోఫు తెమ్మంటే ఎక్ష్ ట్రా సాఫ్ట్ తోఫు తెచ్చిన మొగుడ్ని ముచ్చటగా ముప్పయ్యోసారి తిట్టుకుంది అమ్మ.

సరే, మొత్తానికి ఏదో తిన్నాడు బుజ్జి గాడు. నాప్ టైం అయిందేమో, అమ్మ బాసినేట్ లో పెట్టగానే పడుకుండిపోయాడు ఒక మూడు గంటలు.  లేచాక మళ్ళీ కొంచెం తిని ఆడుకున్నాడు. ఈలోగా ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది. అమ్మతో పాటుగా ఫ్లైట్ దిగిన బుజ్జిగాడు, ఢిల్లీ లో సెక్యూరిటీ చెక్ కి వెళ్ళే దారిలో అమ్మతో దాగుడుమూతలు ఆడాడు. మొత్తానికి మళ్లీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరారు. అక్కడ లగేజ్ తీసుకొని, ఉన్నలేనట్టుండే ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ పూర్తి చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసాక బుజ్జిగాడి బాబాయి కాబ్ తీసుకొని వచ్చాడు. ఆ క్యాబ్ లో ఇంటికి వెళ్తుంటే బుజ్జి గాడికి భలే నచ్చింది. కార్ సీట్లో కుదేసే నాన్న లేరు, అమ్మ కూడా కార్ సీట్ లో కుర్చోమనలేదు. అసలు ఆ కార్ లో కార్ సీట్ లేనేలేదు. హాయిగా వాడికి ఇష్టం వచ్చినంత సేపు వెనక సీట్ మీదినుంచి డ్రైవర్ భుజం మీదకి వాలిపోయి రోడ్డు మీద కార్లు, బైకులు, లారీలు చూస్తుండగానే బాబాయి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. అక్కడ అన్నయ్య పిన్ని కూడా ఉన్నారు. మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసాడు అన్నయ్య తో ఆదుకున్నాడు. ఆ తర్వాత నాన్నమ్మ, అమ్మమ్మల దగ్గరికి బయల్దేరాడు. ఆ సంగతులన్నీ వచ్చే భాగంలో. మీ కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండే.



శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిగాడు










4 comments:

Hemanth Pallavajula said...

Koni commalu miss ayayi.

Hemanth Pallavajula said...

Kallaku kati natu vundii annaya. Bagundi.
Prabhavithulu ayi prayetnincharu. Me prayatnamu, yentha mandhini prabhivitam chestundo.

Jyothirmayi said...

మీ బుజ్జిగాడు భలే ముద్దుగా ఉన్నాడండి. ఇండియాలో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడన్న మాట.

హై హై నాయకా said...

ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు. సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేసాడట

Disqus

Disqus to allow comment moderation