సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
చాలా రోజులతర్వాత ఒక మంచి సినిమా చూసిన సంతృప్తి మిగిల్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు అంజలి (సీత), పెద్దోడు అండ్ చిన్నోడు (వాళ్ళెవరో చెప్పాల్సిన పని లేదనుకుంటా), ఇంకా ప్రకాష్ రాజ్. తన శైలికి భిన్నంగా ముఖాన ఒక నవ్వు తగిలించుకొని సినిమా అంతా లాగేసాడు ప్రకాష్ రాజ్. సహజ నటి జయసుధ గురించి చెప్పాల్సిన అవసరంలేదు...తల్లి పాత్ర లో చాలా ఉదాత్తంగా ఒదిగిపోయింది. సమంతా సినిమా అంతా నిండుగా బట్టల్లో కనిపించిన మొదటి మరియు చివరి సినిమా ఇదేనేమో.
ముఖ్యపాత్రలో అంజలి ఒదిగిపోయిన తీరు అద్భుతం. అందానికి అందం, అభినయానికి అభినయం. మరో సావిత్రి రేంజ్ లో కాకపోయినా మన సౌందర్య కి కాస్త అటూ ఇటుగా అంజలి నటన ఉంది. తెలుగు తెరకి ఒక నిఖార్సైన తెలుగు నాయికా ఇన్నాళ్ళకి దొరికింది..అందలం ఎక్కిస్తారో లాగేస్తారో ఇండస్ట్రీ ఇష్టం. నేను ఐతే అంజలి కి పూర్తిగా ఫిదా (బుజ్జీ, వింటున్నావా :) ) ...
కథ లోకి వెళ్తే: ఇద్దరు అన్నదమ్ములు, బాధ్యత లేని అన్న కి బాధ్యత గుర్తు చేయాలనీ చూసే తమ్ముడు; అన్న పైనే ఆశలు పెట్టుకున్న మేనత్త కూతురు సీత. సీత తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో సీత బాబాయిలు సీత ని మేనమామ ప్రకాష్ రాజ్ వద్దనే వదిలేస్తారు. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తక్కువే. కానీ ఇటువి అటు అటువి ఇటు మోసే జిత్తులమారి చుట్టం తనికెళ్ళ. ఇలాంటి వాళ్ళు అందరి ఇళ్ళల్లోనూ ఉంటారే .
ఇంతకీ అన్నాతమ్ముళ్ళు బాధ్యత తెలుసుకున్నారా? సీత బాబాయిలు మామయ్యలు కలిసారా? సీత ని పెద్దోడు పెళ్లి చేసుకున్నాడా? అంతా వెండితెర మీద చూసి తరించగలరు.
క్లైమాక్స్ లో భద్రాచలం సీన్ సూపర్...అన్నట్టు పెద్దోడికి చిన్నోడికి ఒక చెల్లి కూడా ఉందండోయ్ కానీ అదేంటో చెల్లికి ఒక్క డైలాగ్ కూడా లేదు ఒక పాట మాత్రం ఉంది చెల్లి పెళ్లి కి

No comments:
Post a Comment