ప్రస్తుతం జీవించి ఉన్న లేదా గతకాలపు తెలుగు సాహితీవేత్తల్లో అత్యంత భావదారిద్ర్యం ఉన్న కవి ఎవరంటే అది ఖచ్చితంగా సినారె.
పూటకో మాట గడపకో పాట పాడడంలో సినారె ని మించినవారెవ్వరు లేరు. ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు "తెలుగుజాతి మనది నిండుగా వెలుగుజాతి మనది" అని దేశభక్తి గీతాలు రాసిన సినారె నేడు నాడు రాసిన పాటలన్నీ పొట్టకూటి కోసం రాసాను లేకపోతె రామారావు ఒత్తిడి మీద రాసాను అని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. 1970 లో రాసిన పాటను ఖండించడానికి మన జ్ఞానఫీఠ్ గారికి 32 సంవత్సరాలు పట్టింది, అదికూడా 17 సంవత్సరాల కింద స్వర్గస్తులైన రామారావు మీద నెపం మోపడానికి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేతకానీ, ప్రభుత్వేతర సంస్థలు, చలనచిత్ర రంగం ద్వారాకా నీ అత్యంత లబ్ధి పొందిన సాహితివేత్తల్లో సినారెని మించిన వారెవ్వరు లేరు. అంతెందుకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత ప్రఖ్యాత జ్ఞానఫీఠ్ పొందిన రెండవ తెలుగు కవి సినారెనే. అది కూడా అయన ఇప్పుడు అడిపోసుకుంటున్న రామారావు హయంలోనే (1988) వచ్చింది. సినారె కన్నా ప్రతిభావంతులైన కవులు లేరా మన ఆంధ్ర దేశం లో? ఆంధ్రప్రదేశ్ సినరేకి చేసిన తక్కువేంటి? హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు కాదు పది ఉన్నా, ఆ రాష్ట్రాలకి ఒకే సంస్కృతి సంప్రదాయం, తెలుగు వారిలా ఉమ్మడి ఘన వారసత్వం ఉందా?
చరిత్రలో ఏ రెండు హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయినా మొఘలాయీలు తప్ప ఒకే రాజు పరిపాలన కింద ఎప్పుడైనా
ఉన్నాయా?
స్వార్ధ రాజకీయనాయకులు ఇలా మాట్లాడారంటే రాజకీయం అంతేలే అనుకోవచ్చు కానీ నాటి తరాన్ని నేటి తరాన్ని చూసిన కవిలా కాకపోయినా కనీసం అనుభవం తోనైనా ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన సినారె నేడు తను వీరతెలంగాణావాది నని చెప్పుకోవడం భావదారిద్ర్యం కాక మరేంటి?
ఇకనైనా శ్రీ సినారె తన పద్ధతి మార్చుకుంటారని ఆశిస్తూ,
ఒక అభిమాని
No comments:
Post a Comment