ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ కేంద్రంగా నడిచే అన్ని ప్రధాన పత్రికలలోనూ మావోయిస్టు సానుభూతిపరులు పత్రికా విలేఖరులుగా, సబ్-ఎడిటర్లుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ మావోయిస్టు భావజలంతోనే వీరంతా తెలంగాణా ఉద్యమానికి తమవంతుగా మసాలా వార్తలు వండి వడ్డిస్తున్నారు. ఒకటిని పదిగా, పదిని వెయ్యిగా రాసి ఉద్యమానికి "తమవంతు సహకారం" అందిస్తున్నారు. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తుంటే యాజమాన్యాలు ఎందుకు ఊరుకున్నాయని అనుమానం రావచ్చు. దానికి కూడా బలమైన కారణం ఉంది. "ఆ రెండు" పత్రికలకు జగన్ బూచి, మిగతా/జగన్ అనుకూల పత్రికలకు కాంగ్రెస్/CBI బూచి. ఈ రెండు వర్గాల పత్రికా యాజమాన్యాల కి తమకు నచ్చినట్టుగా అవతలి వారిపై వార్తలు రాయాలంటే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి. ఆ పనిని తెలంగాణా విషయం లో చేస్తున్నాయి ఈ యాజమాన్యాలు.
ఒక వర్గం మీద ఒక ప్రాంతం వారి మీద బురద చల్లడానికి, విషం చిమ్మడానికి ఎంతకైనా వెనుకాడవు ఈరోజుల్లో పత్రికలు, మీడియా. దానికోసం కొత్త పదాలను కూడా పుట్టిస్తాయి. "సీమాంధ్ర" అనే రాక్షస సమాస పదం అలా పుట్టిందే...."ఆంధ్ర" పదం అనే మాట నైజం తెలంగాణ లో ఒక పెద్ద బూతు మాటలా మార్చేసారు విద్వేషం వెళ్లగక్కే నాయకులూ, వారిని మించిన మీడియా ప్రతినిధులు. ఎవరైనా నైజం తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకoగా మాట్లాడే పరిస్తితి లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అంతలా ప్రజలను భయభ్రాంతులను చేసింది (కెసిఆర్ )కచరా గారి పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు లేని చోట్ల ఆ పనిని మీడియా ప్రతినిధులు నిస్సంకోచoగా చేస్తున్నారు. దానికి ఉదాహరణ లగడపాటి మీటింగులు, సమైక్యాంధ్ర సమావేశాలు. అన్నింటిని మించి రెండేళ్ళ నాటి నల్లమోతు చక్రవర్తి గారి పుస్తకావిష్కరణ సభ ఎంత రసాభాస చేసారో అందరూ చూసారు. ఆనాటి సభని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసాక వాళ్ళు లేని లోటు పత్రికా ప్రతినిధులే పూడ్చారు. చక్రవర్తిని అక్కడినుంచి పంపేయడానికి ప్రయత్నించిన ఒక పోలీసు అధికారిని మీడియా వాళ్ళమన్న ముసుగులో నానా దుర్భాషలాదారు. ఆరోజు పోలీసులు సంయమనం పాటించి ఉన్నారు కానీ ఏ కొద్ది చర్య తీసుకొని ఉన్నా మీడియా పై పోలీసు దాడి అని ఎంత రభస చేసి ఉండేదో ఈ మీడియా వర్గం.
అత్యధిక సంఖ్యలో చందాదారులు ఉన్నారని గప్పాలు కొట్టుకొనే ఈనాడు కానీ, ఈనాడు కి అన్ని విషయాల్లో పోటీకి వచ్చే సాక్షి కానీ తెలంగాణా విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామనే మాట చెప్పమనండి? పాత రికార్డులు, రీసెర్చ్ లో కానీ, వనరుల విషయంలో కానీ, ఈనాడు కు పోటీ వచ్చే సంస్థ ఇంకొకటి లేదన్నది నిజం.
కానీ ఇన్ని వనరులు, సదుపాయాలు ఉండి కూడా ఈనాడు పత్రిక తెలంగాణ విషయంలో అర్ధ సత్యాలు అబద్దాలకే ఎక్కువ విలువ ఇస్తోంది. అలా కాకుండా తనకున్న వనరులను సద్వినియోగం చేసుకొని ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తీసుకొని ఉంటె రాష్ట్రం ఇలా రావణ కష్టం అయి ఉండేది కాదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు, ఆఫ్ఘానిస్తాన్ లో పరిస్తుతులు, పశ్చిమ ఆసియా లో శాంతి ఇలాంటి అంతర్జాతీయ వ్యవహారాలపై నిపుణులతో వ్యాసాను వ్యాసాలు రాయించే ఈనాడు పత్రికకు సొంత రాష్ట్రం తగలబడి పోతుంటే చలి కాచుకుంటుంది కానీ తన వంతుగా సమస్య పరిష్కారానికి కృషి చేయదు. అంతెందుకు రెండేళ్ళ క్రితం శ్రీకృష్ణ కమిటీ కి రాష్ట్ర వ్యాప్తంగా అందరు తమ తమ అభిప్రాయాలు చెప్తే ఈనాడు ఆపాటి పని కూడా చేయలేక పోయింది. సమాచార హక్కు మీద ప్రచారం చేసే హక్కు తనకే ఉందని బల్ల గుద్ది చెప్పే ఈనాడు, తెలంగాణా విషయంలో నిజాలను మాత్రం తొక్కి పెడుతుంది. స్వార్ధ రాజకీయ నాయకులు చేసే విషపూరిత ఉపన్యాసాలకి ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఈనాడు, నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళకి మాత్రం రెండో పేజి లోనో మూడో పేజి లోనో అది కూడా మొక్కుబడిగా ఇస్తుంది. అస్సలు ఈనాడులో ముఖ్య పేజీల్లో వార్తల్లో ఉండే వాళ్ళెవరో చూడండి. జగన్ గురించిన సంచలనాలు ఏమి లేకపోతే కిరణ్, బొత్స, బాబు, కెసిఆర్ పోను మిగిలిన వార్తలు అన్ని పేపర్ పులులు అయిన పొన్నం, వివేక్, గుత్తా, మందా, విహెచ్, కేకే ఇంకా మిగిలిన చిల్లర నాయకులు. తెలంగాణా ఉద్యమం అవతల వీళ్ళ పలుకుబడి ఏంటి? మూడేళ్ళ కిందట వీళ్ళల్లో ఎంత మంది పేరు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు?
సాక్షి గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు; అది ఒక వ్యక్తి కరపత్రిక ఆ వ్యక్తికే భజన చేసే పత్రిక.
ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి పత్రికలు ఆంధ్ర అన్న పదాన్ని బూతు మాటగా చూపిస్తూనే ఆ పేరుతోనే పత్రికను అమ్ముకుంటున్నాయి. అదే కోవలో నడుస్తున్న మరో పత్రిక విశాలాంద్ర. బూర్జువా పార్టీలు నడుస్తున్న ఎన్నికలు వోట్ల రాజకీయాల్లోనే నడుస్తూ ఉమ్మడి కమ్మూనిస్ట్ పార్టీ నినాదం అయిన విశాలాంధ్ర నుంచి దూరం నడిచి ఒక ప్రాంతం వారికీ కొమ్ము కాస్తూ మరొక ప్రాంతం వారిని నానా దుర్భాషలాడుతూ నోరు పారేసుకొనే నారాయణ గారు తమ పార్టీ ప్రాపకం తోనే నడిచే పత్రిక పేరు కూడా మార్చుకుంటే మరింత బాగుంటుంది.