Total Pageviews

Thursday, July 3, 2014

Immigration Reforms - My interaction with a local GOP Congressman



I recently met with Congressman Peter J. Roskum (R) representing the Sixth Congressional District of Illinois to discuss his stand on the much debated Comprehensive Immigration Reforms Bill. 
He was very humble and friendly during the entire course of the meeting and he himself came to the Lobby to invite me into the conference room where we spoke for 30 minutes and he also came to lobby to pay sendoff. He shared some of his experiences with immigrants and how passionate he was with their success in their fields. He shared his relationship with his childhood friend Ramesh who lived with Congressman's parents when he was pursuing his Masters in UIC and how hard he worked to earn his Green Card and how successful Ramesh is after starting his own business several decades ago.

While we both do not agree on few of the points we discussed and Obama's rush to get things done using his Executive powers; most of the Congressman's view of points makes sense. Here are some of the highlights from his argument why GOP is blocking Immigration Bill in the House of Representatives:

1. As a Chief Deputy Whip in the House, he was very critical of Obama and Senate version of the Comprehensive Immigration Reforms bill
2. The Congressman agreed with my argument that passing a meaningful immigration reforms bill will open up the economy for many entrepreneurial minds and ultimately boosts the economy.
3. The Senate version of the bill gives 11 million illegal immigrants Green Cards/Citizenship despite many legal, tax paying and law abiding immigrants waiting for their turn for the past decade or so
4. The Southern border of the US is becoming a dangerous place and Southern border must be secured and proper measures are taken to keep illegal immigrants away.
5. There should be a Probationary period for those 11 million undocumented immigrants before they are granted Green Card/Citizenship
6. Rep. Roskum argued that everyone who completes their PhD in US should get their Degrees with a Green Card stapled to it that way US can stop those highly educated people leaving the country after their PhD.
7. Rep Roskum agreed with me that passing the CIR will greatly influence the further growth of our economy and he completed agreed with the study that says every immigrant will add at least five American jobs
8. Congressman agreed that there should be a fair, transparent system that encourages high skilled immigrants from across the World to make United States their homes and contribute to the prosperity of this country  
9. He agreed that no skilled immigrant should be punished for being legal, paying taxes and obeying all the laws by closing the immigration system to them 
10. He quoted Prime Minister Modi to support his/GOP case on the delay
in passing the CIR. He did mentioned that Modi will made a good Prime Minister and he expressed his confidence that Modi will transform India as a Developed Nation. He built his case by continuing to say Modi cannot alone transform India in a day/week/month/year it takes several years before India is completely transformed. Similarly, Immigration Reform will take some time but GOP is committed to bring fairness to the Immigration system. 
He finally concluded saying He and his Party wants to wait until the high tide of excitement and anxiety about the immigration reforms come down and then they wants to have a peaceful bipartisan dialog before House takes up and finally pass the Comprehensive Immigration Reform bill.  


Nothing much was accomplished from this meeting but I had an opportunity to meet with a US lawmaker and present my case and millions of others' cases to let the Congress, especially Republicans know why a meaningful, commonsense Immigration Reforms is good for the economy, people, skilled immigrants of the United States! 

Have a great and safe 4th of July

Tuesday, March 19, 2013

ఎన్టీఆర్ పిల్ల కాకేనా?



తెలుగు మీడియా మరీ ఇంతగా దిగాజరిపోయిందా? ఎన్టీఆర్ కి హిట్లు వచ్చాకే నందమూరి నారా కుటుంబాలు అక్కున జేర్చుకున్నయనేది కాదనలేని నిజమ్. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం కోసం చంద్రబాబు ఎన్నో మెట్లు దిగి వచ్చాడు, ఒకప్పుడు కుటుంబ శుభకార్యాలకు ఆహ్వానం కూడా లేని స్థితి నుంచి చంద్రబాబు స్వయంగా పెళ్లి కుదిర్చే స్థాయికి చేరాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎన్ని హిట్లు వచ్చాయో అదే సమయంలో బాలకృష్ణ కి ఎన్ని హిట్లు వచ్చాయో చూస్తేనే తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటో? ఎన్టీఆర్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ బాలకృష్ణ సినిమాలు? ఒక్క సింహా తప్ప అన్నీ భయంకరమైన ఫ్లాప్స్ కావా? అంత మాత్రాన బాలకృష్ణ ని పెద్ద స్టార్ కాదనడం తప్పు కాదా? ఎన్టీఆర్ మొదట్లో తాత, బాబాయి పేర్లు చెప్పాడు కానీ మామ చంద్రబాబు పేరు ఎన్నడు చెప్పలెదు. ఎన్టీఆర్ పేరు బాబు వాడుకున్నాడు కానీ బాబు పేరుతొ ఎన్టీఆర్ కి కలిసి వచ్చింది ఒక్క పెళ్లి విషయంలోనే.


జగన్ ను, తెరాస ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆ అక్కసు ఎవరిమీద వెళ్ళగక్కాలొ తెలియక, ఉరుమురుమి మంగళం మీద పడిన్ధన్నట్టు ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్నారు. బాలయ్య కంటే, బాబు/చిన్న బాబు కంటే ఎన్టీఆర్ కే జనాలని ఉత్సాహపరిచే ఉపన్యాసం ఇవ్వగల సత్తా ఉంది. ఒకవేళ 2014 ఎన్నికలు ఎన్టీఆర్ ప్రచారం చేయకున్నా గెలుస్తామనే గుడ్డి నమ్మకంలో TDP ఉంటే అది నిజంగా వాళ్ళ చేజేతులా పార్టీని చంపుకోవడమే. మాటకి 100 సార్లు తడబడే బాలయ్య, ఏమి చెప్తాడో అదే చెయ్యని బాబు, ట్విట్టర్ బాబులు కలిసి తల్ల కిందుగా తపస్సు చేసినా TDP అధికారంలోకి రావడం కల్ల. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే అధికారం వస్తుందని కాదు, కాస్తైన గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయి లేకపోతే TDP పోరాటం అంతా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసమే!!!

Saturday, March 16, 2013

స్త్రీ హింస

నిన్నమొన్నటిదాకా నాకొక అక్కో చెల్లెలో ఉంటే బాగుండేది అనిపించేది, లేనందుకు బాధ కూడా వేసేది. కానీ ఇప్పుడు మన భారతంలో జరుగుతున్న దారుణాలను చూసాక నాకు అక్కాచెల్లెళ్లు లేనందుకు కొంత ఉపశమనం కలుగుతోంది. ఎక్కడికి పోతున్నాం మనo? ఆడది అర్దరాత్రి మాట అటుంచు కనీసం పట్ట పగలు నడివీధిలో తిరిగే స్వాతంత్రం అయినా ఉందా ఈదేశంలో అనిపిస్తూంది
ఒక్కొకసారి. "భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరీసొదరమణులు" అని అన్ని భాషలలోనూ అన్ని స్కూళ్ళలోనూ మనం చదివిన "ప్రతిజ్ఞ" ఇదేనా? ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజిమ్పబదతారనే ఆర్యోక్తి ఉన్న దేశంలో ఆడవారికి రక్షణ లేకపోతే ఎవరిది తప్పు? ఆ రక్షణ లేకుండా చేస్తున్న మానవ మృగాలదా, ఆ మృగాలను మనుషులుగా చేయలేక పోయిన తల్లిదండ్రులు, గురువులు, సమజానిదా, సాటి మనుషులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలదా ఎవరిదీ తప్పు?
ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఇదా మన అక్కాచెల్లెళ్ళు కూతుళ్ళు జీవించాల్సిన నేల?  ఈ దురాగతాల్ని ఆపడానికి మనం మన వంతుగా ఏమీ చెయ్యలేమా? సలహాలకి ఆహ్వానం. 

Saturday, February 2, 2013

కేంద్ర దర్యాప్తు సంస్థ - నా ఇం(తుం)టర్వు

అది నవంబర్ 2012. ఒబామా గారు మళ్ళీ గెలిచి పండగ చేసుకుంటున్న రోజులు...అప్పుడప్పుడే మా ఊళ్ళో చలి ప్రవేశిస్తున్న రోజులు...రాత్రి ఎంత తొందరగా పడుకున్నా పొద్దున్నే లేవాలంటే బద్ధకం వేసే రోజులు. అలాంటి ఒకానొక చలి ఉదయాన్నే బుధవారం తెల్లవారుఝామున 7:30 కి లేచి కాసేపు నా ఉద్యోగాన్ని, మేనేజర్ ని, చికాగో చలిని తిట్టుకొని ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్ళాను. పొద్దున్నే పేపర్ చదవడం మన ఆంధ్రుల జన్మహక్కు అది ఆంధ్రా కావచ్చు అమెరికా కావచ్చు..పేపర్ మాత్రం చదవాల్సిందే. అందుకే పొద్దున్న ఆఫీసు కి వెళ్ళాక చేసే మొదటి పని మెయిల్స్ చెక్ చేసుకొని, సిస్టం లోకి లాగిన్ అయ్యి (మరి సడన్ గా   ఎవరైనా వస్తే మన ఈనాడు పేపర్ చూసి భయపడే సమస్యలేమీ రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట) ఈనాడు పేపర్ ఓపెన్ చేసి ఇంకొక విండో లో పేస్ బుక్ కూడా ఓపెన్ చేశాను. అది అంతా  చదవడం అయ్యేలోపు 10:00 అయింది మన టీ టైం.

టీ తాగి వచ్చి, స్టేటస్ మీటింగ్ కి రెడీ అవుతూ ఆ వారం పూర్తి చేయాల్సిన టాస్క్ లిస్టు ప్రిపేర్ చేసుకుని మీటింగ్ కి వెళ్లి  వచ్చాను. మా టీం లో అంతా లంచ్ కి వెళ్లారు.. ఈ రెండు గంటల్లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూద్దామని మళ్లీ ఈనాడు ఓపెన్ చేసి ఎందుకైనా మంచిదని సిస్టం స్క్రీన్ కూడా ఒకటి ఓపెన్ చేసి పెట్టా..ఇంతలో అనుకోని అతిధిలా మా మేనేజర్ వచ్చింది...ఒకసారి తన ఆఫీసులోకి రమ్మని పిలిచింది..వర్క్ మధ్యలో
డిస్టర్బ్ చేయొద్దు తర్వాత వస్తానని చెప్పా సీరియస్ గా, ఆహా కుదరదు ఇప్పుడే రావాలి అర్జెంటు పని అని బతిమిలాడుకుంది. సరేలే పాపం పెద్దది అడుగుతుంది కదాని వెళ్ళాను..వెళ్ళాక రూం డోర్ వేసింది..ఏదో సీరియస్ మేటర్ అని అర్థం అవుతుంది కానీ ఏంటో తట్టడంలేదు.

ఏంటి సంగతి అని అడిగాను...ఉరుములేని పిడుగులాగా పైన ఫ్లోర్ లో నీకోసం కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏజెంట్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పింది. (ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే అర్థం కాకపోతే గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది నా కధకి మాత్రం అడ్డు రాకండి)....మేనేజర్ ఆ మాట చెప్పగానే టైడ్ ఆడ్  లో లాగా అవాక్కయ్యాను, చిన్నగా తేరుకొని  అంతకు ముందు వారం ఎలక్షన్స్ లో ఒబామా కి వ్యతిరేకంగా వోటు హక్కు లేని దేశి గాళ్ళ దగ్గర నా సోద అర్ధం కానీ తెల్లవాళ్ళ దగ్గర వాగింది అప్పుడే వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తుండగా మళ్లి మేనేజర్ అంది పదేళ్ళ కిందట మన దగ్గర పని చేసి వెళ్ళిన "ఫలానా ఫలానా" ప్రోగ్రామర్ కం DBA గుర్తున్నాడా అని అడిగింది. నోరు తెరిస్తే అనర్గళంగా అరగంట మాట్లాడే ఆ "ఫలానా" వారేకదా గుర్తున్నాడు అన్నాడు జీవుడు కేదసం ఏజెంట్ కి ఆ "ఫలానా"  DBA గారికి సంబంధం ఎంటా అని మళ్లీ పెటాఫ్లాప్ స్పీడ్ లో ఆలోచిస్తూ.  నా ఆలోచనలకి బ్రేక్ వేస్తూ ఆ "ఫలానా" DBA గారు నీ పేరు రిఫరెన్స్ కింద ఇచ్చాడు ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ఇప్పుడు ఆ కేదసం గాడు నిన్ను అరగంటో  గంటో  ఇంటర్వ్యూ చేస్తాడు నువ్వు ఒక్కడివే వెళ్తే పాపం కన్ఫ్యూజన్ లో అడిగిన దానికంటే ఎక్కువ చెప్తావేమో నేను కూడా వస్తా అంది అక్కడికేదో నేను ప్రపంచంలోనే పెద్ద అమాయకుడినన్నట్టు. సరే అని చెప్పి కేదసం గాడు ఉన్న రూం లోకి వెళ్ళాము, అమెరికాలో  కేదసం ఏజెంట్ అంటే మన కానిస్టేబులు కనకయ్య గారిలా లేకపోతే మన దేశీయ కేదసం జేడీ లక్ష్మీనారాయణ గారిలా కాకుండా కనీసం ఏడడుగులు ఎత్తు, 40 అంగుళాలు వెడల్పు తెలుగు సినిమా హీరోలాగా 8-ప్యాక్ బాడితో ఉంటాడని ఊహించుకున్నాను..వాడు నా ఊహలకి అంది అందనట్టు ఆరున్నర అడుగులు, 35 అంగుళాలు ఫుల్ సూట్ లో ఉన్నాడు కనుక ఎన్ని ప్యాక్ లో తెలియని ఫిజిక్ లో ఉన్నాడు. వెళ్ళగానే మన పాస్ పోర్ట్ అంత ఉన్న బాడ్జ్ చూపించి చుపించానట్టు చూపించాడు ఏదో పేరు చెప్పి హ్యాండ్ షేక్ చేశాక కూర్చున్నాం ముగ్గురమును. అప్పుడు మొదలెట్టాడు చూడు వాడి ప్రశ్నల ప్రవాహం అబ్బో అబ్బో అరగంట సేపు గుక్క తిప్పుకోనివ్వకుండా "ఫలానా" DBA గారు నాకెలా తెలుసు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చేసేవాడు, వాడికి పిల్లలెంతమంది, పెళ్ళాలు ఎంతమంది, ఏమి బ్రాండ్ మందు తాగేవాడు, ఎక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు ఎక్కడ మాట్లాడావు ఏమి మాట్లాడావ్, ఇక్కడ జాబ్ ఏమి చేసేవాడు, ఎక్కడ కూర్చునేవాడు, ఎన్నింటికి వచ్చేవాడు, ఎన్నింటికి వెళ్ళేవాడు, ఇక్కడి జాబ్ ఎందుకు మానేసాడు, ఎప్పుడు మానేసాడు, ఇక్కడ్నుంచి వెళ్ళాక ఎక్కడ జాబు చేసాడు, వాడు జూదం ఆడతాడా, రేసుల్లో పందాలు కడతాడా,  సరదాగా డ్రగ్స్ ఎమన్నా వాడేవాడా, వాడికి ఇష్టమైన రంగేది, వాడికి వేరే దేశాల్లో చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఉన్నారా, వేరే దేశంలో ఉన్నవాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు పంపాడా పోనీ వేరే దేశం నుంచి వీడికి ఎవరైనా పంపారా,  వాడి ఇల్లు ఎక్కడ, సొంత ఇల్లా అద్దె కొంపా, వాడి ఇంటికి ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా, మీ ఇంటికి వాడేప్పుడైన వచ్చాడా, మీరిద్దరూ కలిసి బయటికి ఎన్ని సార్లు పార్టీకి వెళ్లారు అని రకరకాల ప్రశ్నలు వేసి అడిగినవి మళ్లీ అడిగి చివర్లో నా వంశ పుట్టుపూర్వోత్తరాలు కూడా రాసుకొని వాడి విజిటింగ్ కార్డు ఒకటి మా మేనేజర్ చేతికి
ఇఛాడు. అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా.....అంతా అయిపోయాక "యు హావ్ ఎనీ క్వెస్చన్స్ ఫర్ మీ: అని అడిగాడు అప్పుడు నేను నా ఇంటర్వ్యూ టీవీ లో ఎప్పుడు వస్తుంది అని అడిగాను నీ ఇంటర్వ్యూ టీవీ లో రావడం ఏంటి బుర్ర ఏమన్నా దొబ్బిన్దా ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేటప్పటికి అన్నాడు. అంటే మీరు ఈ ఇంటర్వ్యూ అంట సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేసి ఉంటారుకదా  టీవిలో కాకపోతే కనీసం యూట్యూబ్ లోనైనా పెట్టి లింక్ షేర్ చేయండి ప్లీజ్ అని అడిగితే నన్నో వెర్రివాడిలా చూసి నైస్ మీటింగ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు కేదసం  
వాడు వెళ్ళిపోయాక బతుకు జీవుడా అని వచ్చి నా సీట్ కి వస్తుంటే మా ఐటీ అడ్మిన్ ముసలమ్మ కింద పడి
కొట్టుకుంటూ ఉంది. ఏంటి సంగతి అని మా మేనేజర్ ని అడిగా.

ఇందాక కేదసం ఏజెంట్ వచినప్పుడు రిసెప్షన్ లో ఈ ముసలమ్మే ఉందట వాడు నా కోసం వచ్చానని చెప్పగానే అర్జెంటు గా CIO దగ్గరికి పరిగెత్తుకెళ్ళి సంగతి చెప్పి పడిపోయిందట. సదరు C IO మా మేనేజర్ కిచేప్తే ఆవిడా వెళ్లి ముసలమ్మని ఓదార్చి కేదసం గాడిని సంగతేంటో కనుక్కోని నా
దగ్గరికి వచ్చింది. ముసలమ్మ ఇంకా అదే షాక్ లో ఉండిపోయింది...  


అది నా ఓపెన్ హార్ట్ విత్ కేదసం...Hope you enjoyed it.  

Tuesday, January 22, 2013

తెలంగాణా ఉద్యమం - మీడియా శిఖండి పాత్ర

ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ కేంద్రంగా నడిచే అన్ని ప్రధాన పత్రికలలోనూ మావోయిస్టు సానుభూతిపరులు పత్రికా విలేఖరులుగా, సబ్-ఎడిటర్లుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ మావోయిస్టు భావజలంతోనే వీరంతా తెలంగాణా ఉద్యమానికి తమవంతుగా మసాలా వార్తలు వండి వడ్డిస్తున్నారు. ఒకటిని పదిగా, పదిని వెయ్యిగా రాసి ఉద్యమానికి "తమవంతు సహకారం" అందిస్తున్నారు. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తుంటే యాజమాన్యాలు ఎందుకు ఊరుకున్నాయని అనుమానం రావచ్చు. దానికి కూడా బలమైన కారణం ఉంది. "ఆ రెండు" పత్రికలకు జగన్ బూచి, మిగతా/జగన్ అనుకూల పత్రికలకు కాంగ్రెస్/CBI బూచి. ఈ రెండు వర్గాల పత్రికా యాజమాన్యాల కి తమకు నచ్చినట్టుగా అవతలి వారిపై వార్తలు రాయాలంటే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు పోవాలి. ఆ పనిని తెలంగాణా విషయం లో చేస్తున్నాయి ఈ యాజమాన్యాలు.

ఒక వర్గం మీద ఒక ప్రాంతం వారి మీద బురద చల్లడానికి, విషం చిమ్మడానికి ఎంతకైనా వెనుకాడవు ఈరోజుల్లో పత్రికలు, మీడియా. దానికోసం కొత్త పదాలను కూడా పుట్టిస్తాయి. "సీమాంధ్ర" అనే రాక్షస సమాస పదం అలా పుట్టిందే...."ఆంధ్ర" పదం అనే మాట నైజం తెలంగాణ లో ఒక పెద్ద బూతు మాటలా మార్చేసారు విద్వేషం వెళ్లగక్కే నాయకులూ, వారిని మించిన మీడియా ప్రతినిధులు. ఎవరైనా నైజం తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకoగా మాట్లాడే పరిస్తితి లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అంతలా ప్రజలను భయభ్రాంతులను చేసింది (కెసిఆర్ )కచరా గారి పార్టీ. ఆ పార్టీ కార్యకర్తలు లేని చోట్ల ఆ పనిని మీడియా ప్రతినిధులు నిస్సంకోచoగా చేస్తున్నారు. దానికి ఉదాహరణ లగడపాటి మీటింగులు, సమైక్యాంధ్ర సమావేశాలు. అన్నింటిని మించి రెండేళ్ళ నాటి నల్లమోతు చక్రవర్తి గారి పుస్తకావిష్కరణ సభ ఎంత రసాభాస చేసారో అందరూ చూసారు. ఆనాటి సభని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెరాస కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసాక వాళ్ళు లేని లోటు పత్రికా ప్రతినిధులే పూడ్చారు. చక్రవర్తిని అక్కడినుంచి పంపేయడానికి ప్రయత్నించిన ఒక పోలీసు అధికారిని మీడియా వాళ్ళమన్న ముసుగులో నానా దుర్భాషలాదారు. ఆరోజు పోలీసులు సంయమనం పాటించి ఉన్నారు కానీ ఏ కొద్ది చర్య తీసుకొని ఉన్నా మీడియా పై పోలీసు దాడి అని ఎంత రభస చేసి ఉండేదో ఈ మీడియా వర్గం.
    
అత్యధిక సంఖ్యలో చందాదారులు ఉన్నారని గప్పాలు కొట్టుకొనే ఈనాడు కానీ, ఈనాడు కి అన్ని విషయాల్లో పోటీకి వచ్చే సాక్షి కానీ తెలంగాణా విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామనే మాట చెప్పమనండి? పాత రికార్డులు, రీసెర్చ్ లో కానీ, వనరుల విషయంలో కానీ,  ఈనాడు కు పోటీ వచ్చే సంస్థ ఇంకొకటి లేదన్నది నిజం.
కానీ ఇన్ని వనరులు, సదుపాయాలు ఉండి కూడా ఈనాడు పత్రిక తెలంగాణ విషయంలో అర్ధ సత్యాలు అబద్దాలకే ఎక్కువ విలువ ఇస్తోంది. అలా కాకుండా తనకున్న వనరులను సద్వినియోగం చేసుకొని ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత తీసుకొని ఉంటె రాష్ట్రం ఇలా రావణ కష్టం అయి ఉండేది కాదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు, ఆఫ్ఘానిస్తాన్ లో పరిస్తుతులు, పశ్చిమ ఆసియా లో శాంతి ఇలాంటి అంతర్జాతీయ వ్యవహారాలపై నిపుణులతో వ్యాసాను వ్యాసాలు రాయించే ఈనాడు పత్రికకు సొంత రాష్ట్రం తగలబడి పోతుంటే చలి కాచుకుంటుంది కానీ తన వంతుగా సమస్య పరిష్కారానికి కృషి చేయదు. అంతెందుకు రెండేళ్ళ క్రితం శ్రీకృష్ణ కమిటీ కి రాష్ట్ర వ్యాప్తంగా అందరు తమ తమ అభిప్రాయాలు చెప్తే ఈనాడు ఆపాటి పని కూడా చేయలేక పోయింది.  సమాచార హక్కు మీద ప్రచారం చేసే హక్కు తనకే ఉందని బల్ల గుద్ది చెప్పే ఈనాడు, తెలంగాణా విషయంలో నిజాలను మాత్రం తొక్కి పెడుతుంది. స్వార్ధ రాజకీయ నాయకులు చేసే విషపూరిత ఉపన్యాసాలకి ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఈనాడు, నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళకి మాత్రం రెండో పేజి లోనో మూడో పేజి లోనో అది కూడా మొక్కుబడిగా ఇస్తుంది. అస్సలు ఈనాడులో ముఖ్య పేజీల్లో వార్తల్లో ఉండే వాళ్ళెవరో చూడండి. జగన్ గురించిన సంచలనాలు ఏమి లేకపోతే కిరణ్, బొత్స, బాబు, కెసిఆర్ పోను మిగిలిన వార్తలు అన్ని పేపర్ పులులు అయిన పొన్నం, వివేక్, గుత్తా, మందా, విహెచ్, కేకే ఇంకా మిగిలిన చిల్లర నాయకులు. తెలంగాణా ఉద్యమం అవతల వీళ్ళ పలుకుబడి ఏంటి? మూడేళ్ళ కిందట వీళ్ళల్లో ఎంత మంది పేరు రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు?
సాక్షి గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు; అది ఒక వ్యక్తి కరపత్రిక ఆ వ్యక్తికే భజన చేసే పత్రిక.
 ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి పత్రికలు ఆంధ్ర అన్న పదాన్ని బూతు మాటగా చూపిస్తూనే ఆ పేరుతోనే పత్రికను అమ్ముకుంటున్నాయి. అదే కోవలో నడుస్తున్న మరో పత్రిక విశాలాంద్ర. బూర్జువా పార్టీలు నడుస్తున్న ఎన్నికలు వోట్ల రాజకీయాల్లోనే నడుస్తూ ఉమ్మడి కమ్మూనిస్ట్ పార్టీ నినాదం అయిన విశాలాంధ్ర నుంచి దూరం నడిచి ఒక ప్రాంతం వారికీ కొమ్ము కాస్తూ మరొక ప్రాంతం వారిని నానా దుర్భాషలాడుతూ నోరు పారేసుకొనే నారాయణ గారు తమ పార్టీ ప్రాపకం తోనే నడిచే పత్రిక పేరు కూడా మార్చుకుంటే మరింత బాగుంటుంది.       






          

Sunday, January 20, 2013

సినారె


ప్రస్తుతం జీవించి ఉన్న లేదా గతకాలపు తెలుగు సాహితీవేత్తల్లో అత్యంత భావదారిద్ర్యం ఉన్న కవి ఎవరంటే అది ఖచ్చితంగా సినారె.
పూటకో మాట గడపకో పాట పాడడంలో సినారె ని మించినవారెవ్వరు లేరు. ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు "తెలుగుజాతి మనది నిండుగా వెలుగుజాతి మనది" అని దేశభక్తి గీతాలు రాసిన సినారె నేడు నాడు రాసిన పాటలన్నీ పొట్టకూటి కోసం రాసాను లేకపోతె రామారావు ఒత్తిడి మీద రాసాను అని కల్లబొల్లి కబుర్లు చెప్తున్నాడు. 1970 లో రాసిన పాటను ఖండించడానికి మన జ్ఞానఫీఠ్ గారికి 32 సంవత్సరాలు పట్టింది, అదికూడా 17 సంవత్సరాల కింద స్వర్గస్తులైన రామారావు మీద నెపం మోపడానికి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేతకానీ, ప్రభుత్వేతర సంస్థలు, చలనచిత్ర రంగం ద్వారాకా నీ  అత్యంత లబ్ధి పొందిన సాహితివేత్తల్లో సినారెని మించిన వారెవ్వరు లేరు.  అంతెందుకు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత ప్రఖ్యాత జ్ఞానఫీఠ్ పొందిన రెండవ తెలుగు కవి సినారెనే. అది కూడా అయన ఇప్పుడు అడిపోసుకుంటున్న రామారావు హయంలోనే (1988) వచ్చింది. సినారె  కన్నా ప్రతిభావంతులైన  కవులు లేరా మన ఆంధ్ర దేశం లో? ఆంధ్రప్రదేశ్ సినరేకి చేసిన తక్కువేంటి? హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏడు కాదు పది ఉన్నా, ఆ రాష్ట్రాలకి ఒకే సంస్కృతి సంప్రదాయం, తెలుగు వారిలా  ఉమ్మడి ఘన  వారసత్వం ఉందా?
చరిత్రలో ఏ రెండు హిందీ మాట్లాడే రాష్ట్రాలు అయినా మొఘలాయీలు తప్ప ఒకే రాజు పరిపాలన కింద ఎప్పుడైనా
ఉన్నాయా?

స్వార్ధ రాజకీయనాయకులు ఇలా మాట్లాడారంటే రాజకీయం అంతేలే అనుకోవచ్చు కానీ నాటి తరాన్ని నేటి తరాన్ని చూసిన కవిలా కాకపోయినా కనీసం అనుభవం తోనైనా ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన సినారె నేడు తను వీరతెలంగాణావాది నని చెప్పుకోవడం భావదారిద్ర్యం కాక మరేంటి?

ఇకనైనా శ్రీ సినారె తన పద్ధతి మార్చుకుంటారని ఆశిస్తూ,

ఒక అభిమాని 


  

Saturday, January 12, 2013

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడి మొదటి విదేశియానం

బుజ్జిగాడు (ముద్దుపేరు గున్ను ) మొదటిసారి అమ్మానాన్నల మాతృభూమి భారతదేశానికి నాలుగు నెలల సెలవులకి వెళ్ళాడు. డిసెంబర్ 10, 2012 న ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో అమ్మ తో కలిసి ఇండియా కి బయల్దేరాడు గున్ను.  ప్రయాణానికి 10 రోజుల ముందునుండే బుజ్జి గాడి నాన్న వాడిని వదిలి అన్నిరోజులు ఎలా ఉండాలా అని బాధ పడ్తుంటే బుజ్జి గాడికి అవేమి అర్థం కాలేదు పాపం. తీరా జర్నీ రోజు, చెక్-ఇన్ అంతా అయిపోయి సెక్యూరిటీ చెక్ లో వెళ్ళేదాకా బుజ్జి గాడు నాన్న చంకలోనే ఉన్నాడు. అమ్మ సెక్యూరిటీ చెక్కి  వెళ్ళాలి ఫ్లైట్ బయల్దేరే టైం అవుతుంది నాన్నకి బాయ్ చెప్పి నా దగ్గరికి రామ్మా గున్నూ అంటే బుజ్జిగాడు నాన్న చొక్కా పట్టుకొని గట్టిగ నాన్నకె అతు క్కుపోయాడు. అప్పుడు నాన్న గున్నుని బలవంతంగా అమ్మ కి ఇచ్చేసారు. అప్పుడు గున్నుగాడికి భలే కోపం వచ్చింది. కోపంగా నాన్న వంక ఒక చూపు చూసి అమ్మతో కలిసి సెక్యూరిటీ చెక్ ఏరియా లోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు సెక్యూరిటీ చెక్ లో  TSA ఏజెంట్ అమ్మ దగ్గరున్న అన్ని బాగులు ఓపెన్ చేయమన్నాడు. అమ్మ ఆ హడావుడిలో ఉంటె అంతమంది జనాలని చూసి బుజ్జిగాడికి భయం వేసింది ఏమవుతున్దా అని. ఈలోగా అమ్మ ఒక బాగ్ లోనుంచి లాప్టాప్ తీస్తుంటే బుజ్జిగాడు  అది నాకు కావాలి అని అమ్మకి అడ్డం వచ్చాడు అమ్మ చుసుకోకపోవడంతో లాప్టాప్ బుజ్జి గాడికి తగిలి ఏడుపు లంగించుకున్నాడు బుజ్జి గాడు. మొత్తానికి  ఫ్లైట్ ఎక్కారు బుజ్జి గాడు అమ్మ. గున్ను గాడికి ఫ్లైట్ ఎంతగానో నచ్చింది. అంతమంది జనాలు ఒకచోట కూడితే ఇంక వాడికి పండగేకడా. అమ్మ TSA వాడితో పోట్లాడి మరీ తెచ్చిన 10 రకాల తినుబండారాలు (స్నాక్స్) ని అన్నిటిని నచ్చలేదని వదిలేసాడు గున్ను. బుజ్జిగాడికి ఇష్టమని ఎక్ష్ ట్రా ఫర్మ్ తోఫు తెమ్మంటే ఎక్ష్ ట్రా సాఫ్ట్ తోఫు తెచ్చిన మొగుడ్ని ముచ్చటగా ముప్పయ్యోసారి తిట్టుకుంది అమ్మ.

సరే, మొత్తానికి ఏదో తిన్నాడు బుజ్జి గాడు. నాప్ టైం అయిందేమో, అమ్మ బాసినేట్ లో పెట్టగానే పడుకుండిపోయాడు ఒక మూడు గంటలు.  లేచాక మళ్ళీ కొంచెం తిని ఆడుకున్నాడు. ఈలోగా ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది. అమ్మతో పాటుగా ఫ్లైట్ దిగిన బుజ్జిగాడు, ఢిల్లీ లో సెక్యూరిటీ చెక్ కి వెళ్ళే దారిలో అమ్మతో దాగుడుమూతలు ఆడాడు. మొత్తానికి మళ్లీ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరారు. అక్కడ లగేజ్ తీసుకొని, ఉన్నలేనట్టుండే ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ పూర్తి చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసాక బుజ్జిగాడి బాబాయి కాబ్ తీసుకొని వచ్చాడు. ఆ క్యాబ్ లో ఇంటికి వెళ్తుంటే బుజ్జి గాడికి భలే నచ్చింది. కార్ సీట్లో కుదేసే నాన్న లేరు, అమ్మ కూడా కార్ సీట్ లో కుర్చోమనలేదు. అసలు ఆ కార్ లో కార్ సీట్ లేనేలేదు. హాయిగా వాడికి ఇష్టం వచ్చినంత సేపు వెనక సీట్ మీదినుంచి డ్రైవర్ భుజం మీదకి వాలిపోయి రోడ్డు మీద కార్లు, బైకులు, లారీలు చూస్తుండగానే బాబాయి వాళ్ళ ఇల్లు వచ్చేసింది. అక్కడ అన్నయ్య పిన్ని కూడా ఉన్నారు. మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసాడు అన్నయ్య తో ఆదుకున్నాడు. ఆ తర్వాత నాన్నమ్మ, అమ్మమ్మల దగ్గరికి బయల్దేరాడు. ఆ సంగతులన్నీ వచ్చే భాగంలో. మీ కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండే.



శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిగాడు










Disqus

Disqus to allow comment moderation