అది నవంబర్ 2012. ఒబామా గారు మళ్ళీ గెలిచి పండగ చేసుకుంటున్న రోజులు...అప్పుడప్పుడే మా ఊళ్ళో చలి ప్రవేశిస్తున్న రోజులు...రాత్రి ఎంత తొందరగా పడుకున్నా పొద్దున్నే లేవాలంటే బద్ధకం వేసే రోజులు. అలాంటి ఒకానొక చలి ఉదయాన్నే బుధవారం తెల్లవారుఝామున 7:30 కి లేచి కాసేపు నా ఉద్యోగాన్ని, మేనేజర్ ని, చికాగో చలిని తిట్టుకొని ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్ళాను. పొద్దున్నే పేపర్ చదవడం మన ఆంధ్రుల జన్మహక్కు అది ఆంధ్రా కావచ్చు అమెరికా కావచ్చు..పేపర్ మాత్రం చదవాల్సిందే. అందుకే పొద్దున్న ఆఫీసు కి వెళ్ళాక చేసే మొదటి పని మెయిల్స్ చెక్ చేసుకొని, సిస్టం లోకి లాగిన్ అయ్యి (మరి సడన్ గా ఎవరైనా వస్తే మన ఈనాడు పేపర్ చూసి భయపడే సమస్యలేమీ రాకుండా ముందు జాగ్రత్త అన్నమాట) ఈనాడు పేపర్ ఓపెన్ చేసి ఇంకొక విండో లో పేస్ బుక్ కూడా ఓపెన్ చేశాను. అది అంతా చదవడం అయ్యేలోపు 10:00 అయింది మన టీ టైం.
టీ తాగి వచ్చి, స్టేటస్ మీటింగ్ కి రెడీ అవుతూ ఆ వారం పూర్తి చేయాల్సిన టాస్క్ లిస్టు ప్రిపేర్ చేసుకుని మీటింగ్ కి వెళ్లి వచ్చాను. మా టీం లో అంతా లంచ్ కి వెళ్లారు.. ఈ రెండు గంటల్లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో చూద్దామని మళ్లీ ఈనాడు ఓపెన్ చేసి ఎందుకైనా మంచిదని సిస్టం స్క్రీన్ కూడా ఒకటి ఓపెన్ చేసి పెట్టా..ఇంతలో అనుకోని అతిధిలా మా మేనేజర్ వచ్చింది...ఒకసారి తన ఆఫీసులోకి రమ్మని పిలిచింది..వర్క్ మధ్యలో
డిస్టర్బ్ చేయొద్దు తర్వాత వస్తానని చెప్పా సీరియస్ గా, ఆహా కుదరదు ఇప్పుడే రావాలి అర్జెంటు పని అని బతిమిలాడుకుంది. సరేలే పాపం పెద్దది అడుగుతుంది కదాని వెళ్ళాను..వెళ్ళాక రూం డోర్ వేసింది..ఏదో సీరియస్ మేటర్ అని అర్థం అవుతుంది కానీ ఏంటో తట్టడంలేదు.
ఏంటి సంగతి అని అడిగాను...ఉరుములేని పిడుగులాగా పైన ఫ్లోర్ లో నీకోసం కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏజెంట్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పింది. (ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే అర్థం కాకపోతే గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది నా కధకి మాత్రం అడ్డు రాకండి)....మేనేజర్ ఆ మాట చెప్పగానే టైడ్ ఆడ్ లో లాగా అవాక్కయ్యాను, చిన్నగా తేరుకొని అంతకు ముందు వారం ఎలక్షన్స్ లో ఒబామా కి వ్యతిరేకంగా వోటు హక్కు లేని దేశి గాళ్ళ దగ్గర నా సోద అర్ధం కానీ తెల్లవాళ్ళ దగ్గర వాగింది అప్పుడే వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తుండగా మళ్లి మేనేజర్ అంది పదేళ్ళ కిందట మన దగ్గర పని చేసి వెళ్ళిన "ఫలానా ఫలానా" ప్రోగ్రామర్ కం DBA గుర్తున్నాడా అని అడిగింది. నోరు తెరిస్తే అనర్గళంగా అరగంట మాట్లాడే ఆ "ఫలానా" వారేకదా గుర్తున్నాడు అన్నాడు జీవుడు కేదసం ఏజెంట్ కి ఆ "ఫలానా" DBA గారికి సంబంధం ఎంటా అని మళ్లీ పెటాఫ్లాప్ స్పీడ్ లో ఆలోచిస్తూ. నా ఆలోచనలకి బ్రేక్ వేస్తూ ఆ "ఫలానా" DBA గారు నీ పేరు రిఫరెన్స్ కింద ఇచ్చాడు ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ఇప్పుడు ఆ కేదసం గాడు నిన్ను అరగంటో గంటో ఇంటర్వ్యూ చేస్తాడు నువ్వు ఒక్కడివే వెళ్తే పాపం కన్ఫ్యూజన్ లో అడిగిన దానికంటే ఎక్కువ చెప్తావేమో నేను కూడా వస్తా అంది అక్కడికేదో నేను ప్రపంచంలోనే పెద్ద అమాయకుడినన్నట్టు. సరే అని చెప్పి కేదసం గాడు ఉన్న రూం లోకి వెళ్ళాము, అమెరికాలో కేదసం ఏజెంట్ అంటే మన కానిస్టేబులు కనకయ్య గారిలా లేకపోతే మన దేశీయ కేదసం జేడీ లక్ష్మీనారాయణ గారిలా కాకుండా కనీసం ఏడడుగులు ఎత్తు, 40 అంగుళాలు వెడల్పు తెలుగు సినిమా హీరోలాగా 8-ప్యాక్ బాడితో ఉంటాడని ఊహించుకున్నాను..వాడు నా ఊహలకి అంది అందనట్టు ఆరున్నర అడుగులు, 35 అంగుళాలు ఫుల్ సూట్ లో ఉన్నాడు కనుక ఎన్ని ప్యాక్ లో తెలియని ఫిజిక్ లో ఉన్నాడు. వెళ్ళగానే మన పాస్ పోర్ట్ అంత ఉన్న బాడ్జ్ చూపించి చుపించానట్టు చూపించాడు ఏదో పేరు చెప్పి హ్యాండ్ షేక్ చేశాక కూర్చున్నాం ముగ్గురమును. అప్పుడు మొదలెట్టాడు చూడు వాడి ప్రశ్నల ప్రవాహం అబ్బో అబ్బో అరగంట సేపు గుక్క తిప్పుకోనివ్వకుండా "ఫలానా" DBA గారు నాకెలా తెలుసు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చేసేవాడు, వాడికి పిల్లలెంతమంది, పెళ్ళాలు ఎంతమంది, ఏమి బ్రాండ్ మందు తాగేవాడు, ఎక్కడ ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు ఎక్కడ మాట్లాడావు ఏమి మాట్లాడావ్, ఇక్కడ జాబ్ ఏమి చేసేవాడు, ఎక్కడ కూర్చునేవాడు, ఎన్నింటికి వచ్చేవాడు, ఎన్నింటికి వెళ్ళేవాడు, ఇక్కడి జాబ్ ఎందుకు మానేసాడు, ఎప్పుడు మానేసాడు, ఇక్కడ్నుంచి వెళ్ళాక ఎక్కడ జాబు చేసాడు, వాడు జూదం ఆడతాడా, రేసుల్లో పందాలు కడతాడా, సరదాగా డ్రగ్స్ ఎమన్నా వాడేవాడా, వాడికి ఇష్టమైన రంగేది, వాడికి వేరే దేశాల్లో చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఉన్నారా, వేరే దేశంలో ఉన్నవాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు పంపాడా పోనీ వేరే దేశం నుంచి వీడికి ఎవరైనా పంపారా, వాడి ఇల్లు ఎక్కడ, సొంత ఇల్లా అద్దె కొంపా, వాడి ఇంటికి ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా, మీ ఇంటికి వాడేప్పుడైన వచ్చాడా, మీరిద్దరూ కలిసి బయటికి ఎన్ని సార్లు పార్టీకి వెళ్లారు అని రకరకాల ప్రశ్నలు వేసి అడిగినవి మళ్లీ అడిగి చివర్లో నా వంశ పుట్టుపూర్వోత్తరాలు కూడా రాసుకొని వాడి విజిటింగ్ కార్డు ఒకటి మా మేనేజర్ చేతికి
ఇఛాడు. అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా.....అంతా అయిపోయాక "యు హావ్ ఎనీ క్వెస్చన్స్ ఫర్ మీ: అని అడిగాడు అప్పుడు నేను నా ఇంటర్వ్యూ టీవీ లో ఎప్పుడు వస్తుంది అని అడిగాను నీ ఇంటర్వ్యూ టీవీ లో రావడం ఏంటి బుర్ర ఏమన్నా దొబ్బిన్దా ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేటప్పటికి అన్నాడు. అంటే మీరు ఈ ఇంటర్వ్యూ అంట సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేసి ఉంటారుకదా టీవిలో కాకపోతే కనీసం యూట్యూబ్ లోనైనా పెట్టి లింక్ షేర్ చేయండి ప్లీజ్ అని అడిగితే నన్నో వెర్రివాడిలా చూసి నైస్ మీటింగ్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు కేదసం
వాడు వెళ్ళిపోయాక బతుకు జీవుడా అని వచ్చి నా సీట్ కి వస్తుంటే మా ఐటీ అడ్మిన్ ముసలమ్మ కింద పడి
కొట్టుకుంటూ ఉంది. ఏంటి సంగతి అని మా మేనేజర్ ని అడిగా.
ఇందాక కేదసం ఏజెంట్ వచినప్పుడు రిసెప్షన్ లో ఈ ముసలమ్మే ఉందట వాడు నా కోసం వచ్చానని చెప్పగానే అర్జెంటు గా CIO దగ్గరికి పరిగెత్తుకెళ్ళి సంగతి చెప్పి పడిపోయిందట. సదరు C IO మా మేనేజర్ కిచేప్తే ఆవిడా వెళ్లి ముసలమ్మని ఓదార్చి కేదసం గాడిని సంగతేంటో కనుక్కోని నా
దగ్గరికి వచ్చింది. ముసలమ్మ ఇంకా అదే షాక్ లో ఉండిపోయింది...
అది నా ఓపెన్ హార్ట్ విత్ కేదసం...Hope you enjoyed it.

No comments:
Post a Comment